కరోనా తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు కామారెడ్డి జిల్లాలో సర్వే చేపట్టారు. రెండు రోజుల పాటు ఈ సర్వే సాగనుంది. పది మండలాల్లో.. మండలానికొక గ్రామం చొప్పున ఐదు వందల వరకు రక్త నమూనాలు ర్యాండమ్‌గా సేకరిస్తున్నారు.
సీరో సర్వేలెన్స్ పేరుతో చేపట్టిన ఈ సర్వేలో భాగంగా బుధవారం పిట్లం మండలం ధర్మారం, గాంధారి మండలం నేరల్ తండా, నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి, జుక్కల్ మండలం చిన్న ఎడ్గి, పెద్ద కొడప్గల్ మండలం కేంద్రంలో నమూనాలు సేకరిస్తోంది.
గురువారం ఎల్లారెడ్డి, కామారెడ్డి, మాచారెడ్డి, రాజంపేట్, తాడ్వాయి మండలాల్లో నమూనాలు సేకరించనున్నారు. వైద్యులు, ఏఎన్ఎంలు, పర్యవేక్షకులు, ఆశా సిబ్బందితో కూడిన పది బృందాలు ఈ శాంపిల్స్ సేకరిస్తున్నాయి.