హిజ్రాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యంగ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట హిజ్రాలు ఆమరణ నిరాహార దీక్షచేపట్టారు. బీడీఎస్ఎఫ్ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. హిజ్రాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డిలో పదేళ్లుగా ఉంటున్నా నిలువ నీడలేదని వాపోయారు. లాక్ డౌన్ సమయంలో వసతి కల్పించి... ప్రస్తుతం అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రెండు పడక గదుల ఇళ్లను ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఆధార్, రేషన్ కార్డులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రీ, సిరి, రేష్మా, చిత్ర, కీర్తన తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మావోయిస్టుల మరో దుశ్చర్య.. 5 వాహనాలకు నిప్పు!