కామారెడ్డి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలన్నీ నీట మునిగిపోయాయి. రైతులందరూ తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. మద్నూర్ మండలం రాచూర్ గ్రామానికి చెందిన రాజుపాటిల్ అనే రైతు 6 ఎకరాల్లో సోయా సాగు చేయగా... పంట నూర్పిడి చేసి బస్తాల్లో నింపారు.
వర్షం జోరుగా రావటం వల్ల బస్తాలను వదిలేసి ఇంటికి వచ్చేశారు. వాగు పక్కనే చేను ఉండటం వల్ల ప్రవాహం ఎక్కువై సంచులన్నీ నీట మునిగాయి. నీటిలో ఈత కొడుతూ వెళ్లి సంచులను రైతులు బయటకు తీసుకొచ్చారు. చేతికొచ్చిన పంట నీటిలో తడిసిపోవటం వల్ల తీవ్రం నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.