కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం అంబారిపేటలో కలెక్టర్ సత్యనారాయణ పర్యటించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పర్యవేక్షించారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త వాటిని నాటి నీరు పోశారు. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా హరితహారం సంపూర్ణంగా అమలుచేసి రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలనే సీఎం కేసీఆర్ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. చెట్లు ఉంటేనే భవిష్యత్తు బాగుపడుతుందని... లేకుంటే దిల్లీ లాంటి పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.
ఇవీచూడండి: వేధిస్తున్నాడని భర్తని చంపిన భార్య