కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు.. 68 జీవో అమలు చేసి కనీస వేతనం కల్పించాలని ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎల్లారెడ్డి ,కామారెడ్డి, బాన్సువాడ,మద్నూర్, దోమకొండ కార్మికులు కనీస వేతనం కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు వేతనాలు 68 జీవో ప్రకారం ఇవ్వాలని కోరారు. ఐసీయూలో పడకలు పెరగటంతో కార్మికులకు 12 గంటల పని ఎక్కువ కావడం జరుగుతుందని.. హాస్పిటల్లో కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.
బతికేదేలా..
కార్మికులతో చర్చలు జరిపిన ఆరోగ్యశాఖ మంత్రి రూ. 21,000 ఇస్తానని చెప్పారని.. కానీ ఇప్పటివరకు 7500 వేతనంతో కాలం వెళ్లదీస్తున్నామన్నారు. కామారెడ్డిలో అద్దె భవనంలో ఉండాలంటే కిరాయికి రూ. 3000 పోగా మిగతా నాలుగు వేల రూపాయలతో ఎలా బతకాలని వారి ఆవేదన వ్యక్త పరిచారు.
''నిత్యావసర ధరలకు తోడు గ్యాస్ ధర పెరగడం కార్మికులకు భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే అమలు 68 జీవోను వెంటనే అమలు చేసి న్యాయం చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనం పెంచుకుంటే ఉద్యమానికి సిద్ధం అవుతాం''.
-ఎల్ దశరథ్ ,మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఇదీ చదవండి:"కొత్త" వైరస్ ప్రాణాంతకమేమీ కాదు.. కానీ..: మంత్రి ఈటల