Gandhari Police Station Nizamabad : కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి కొంచెం ఎక్కువ కాలం పని చేసే ఎస్సై కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే కొద్దికాలం మాత్రమే పని చేయడం. ఆ తర్వాత బదిలీపై వెళ్లడం వాళ్లకు సాధారణమైపోయింది. కామారెడ్డి జిల్లాలో గిరిజన ప్రజలు అధికంగా ఉండే మండలం గాంధారి. అలాగే విస్తీర్ణం పరంగానూ ఈ మండలం పెద్దదే. తండాలు అధికంగా ఉండే ప్రాంతమిది.
Frequent Transfers in Gandhari Police Station Nizamabad : ఎక్కువగా చదువుకోని గిరిజన ప్రజలుండే ఈ ప్రాంతంలో వివాదాలూ ఎక్కువే. కానీ ఈ మండలంలో పని చేసే పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మాత్రం కొద్దికాలమే ఉంటారు. మారుమూల ప్రాంతం కావడంతో సాధారణంగానే ఎవరూ రావడానికి ఇష్టపడరు. అలాగని వచ్చిన ఎస్సైలు ఎక్కువ కాలం పని చేసే పరిస్థితి లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుశాఖలో సంచలనం.. 91 మంది అధికారుల స్థానచలనం.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే తొలిసారి
''గాంధారి పోలీస్ స్టేషన్లో ఎస్సైలు మూడు నెలలకు మించి పనిచేయలేకపోతున్నారు. నాయకుల ఒత్తిడి ఇక్కడ ఎక్కువ. ప్రజా సమస్యలపై పని చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యే ఏది చెప్పినా చేయాలి. లేకపోతే అప్పటికప్పుడు బదిలీపై పంపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నేతలు.. చెప్పినట్టు వినకుంటే పోలీసులను.. భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఎస్సై ప్రజా సమస్యలపై పట్టించుకునేవాడు. ఆయనను కూడా వేరే జిల్లాకు బదిలీ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజల భద్రతకు ప్రాముఖ్యతనిచ్చి పోలీసులు ఎక్కువ కాలం పని చేసేలా చూడాలని కోరుతున్నాను.'' - రమేశ్, కాంగ్రెస్ నాయకుడు
Gandhari Police Station SI Transfers : గాంధారి పీఎస్లో అత్యల్పంగా రెండు నెలలు.. గరిష్ఠంగా రెండేళ్లు మాత్రమే ఎస్సైలు పని చేశారు. ఏడాది, సంవత్సరన్నర, రెండేళ్లు పని చేసిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టే పరిస్థితి ఉండగా.. మూడు, ఆరు లేదంటే తొమ్మిది నెలలు పని చేసిన సందర్భాలే అధికంగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2011 నుంచి ఇప్పటి వరకు 14 మంది ఎస్సైలు మారారు. ఎవ్వరూ నిలకడగా లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయి మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం పని చేస్తున్న ఎస్సై సుధాకర్ సిరిసిల్ల జిల్లాకు బదిలీపై వెళ్లిపోయారు. ఈ ఏడాది మార్చిలో గాంధారి పీఎస్ కు వచ్చిన సుధాకర్ ఆగస్టు 31న వెళ్లిపోయారు. అంటే కేవలం ఆరు నెలలు మాత్రమే ఇక్కడ పని చేశారు. సరిగ్గా మండలం గురించి అర్థం చేసుకుని స్టేషన్లో కేసులపై దృష్టి పెట్టే లోపే బదిలీ చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అంతకు ముందు రాజేశ్ అనే ఎస్సై కేవలం ఐదు నెలలు, సాయిరెడ్డి అనే ఎస్సై ఆరు నెలలు, నర్సింహారావు అనే ఎస్సై కేవలం నెలన్నర కూడా అంటే కేవలం 43 రోజులు మాత్రమే పని చేశారు. అంతకు ముందు శంకర్.. ఏడు నెలలు మాత్రమే ఉన్నారు. సతీశ్.. రెండు నెలలు మాత్రమే పని చేశారు. రాజేశ్ అనే ఎస్సై ఏడు నెలలు, వీర బాబు అనే ఎస్సై ఆరు నెలలు, నరేందర్ రెడ్డి అనే ఎస్సై ఐదు నెలలు కాలం మాత్రమే విధులు నిర్వర్తించగలిగారు.
గాంధారి పీఎస్లో సంవత్సరం కంటే ఎక్కువ పని చేసిన ఎస్సైలు చాలా తక్కువ మందనే చెప్పాలి. చందర్ రాఠోడ్ అనే వ్యక్తి 2011 డిసెంబర్ నుంచి 2013 జూన్ చివరి వరకు ఏడాదిన్నర పని చేశారు. మామిడి రవి కుమార్ 2015 జూన్ నుంచి డిసెంబర్ 2016 వరకు .. సత్యనారాయణ 2017 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు విధులు నిర్వహించారు. శ్రీకాంత్ .. 2019 డిసెంబర్ నుంచి 2021 మార్చి వరకు విధుల్లో ఉన్నారు. వీళ్లు మాత్రమే కొంత ఎక్కువ కాలం గాంధారి పీఎస్లో విధులు నిర్వహించగలిగారు.
Hyderabad Begging Mafia : సాయం పేరిట సంపాదన.. NGO పేరిట భిక్షాటన.. బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు
Police Carry Dead Bodies : పోలీసుల మానవత్వం.. మృతదేహాలను భుజాలపై మోసి