కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి ర్యాలీ చేపట్టారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాతో చర్చలు జరపటానికి సీఎం కేసీఆర్ ఎందుకు ఆలోచిస్తున్నారని కార్మికులు ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు వెనక్కి తగ్గేది లేదని ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ కే.ఎస్.లత అన్నారు. పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇదీ చూడండి : కండక్టర్ సురేందర్ భౌతికకాయానికి పలువురు నేతల నివాళి