కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి శ్రీ కాళభైరవ స్వామి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయి సందడిగా మారింది. వేకువజాము నుంచే ప్రజలు ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.
మంగళవారం కావడం వల్లే భక్తులు అధికంగా వచ్చినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తే.. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అర్చకులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: శిరస్త్రాణం ధరించకుంటే క్లిక్మనిపిస్తారు..