ETV Bharat / state

నిజాంసాగర్ గేట్లు ఎత్తాలని రైతుల ఆందోళన - కామారెడ్డి తాజా వార్తలు

మంజీరా నది ప్రవాహంతో.. పరివాహక ప్రాంతాల్లోని చేతికొచ్చిన రెండు వేల ఎకరాల వరి పంట నీట మునిగింది. నిజాంసాగర్​ గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ధర్నాకు కాంగ్రెస్​ పార్టీ మద్దతు తెలిపింది.

Formers Protest On Medak Highwayy
నిజాంసాగర్ గేట్లు ఎత్తాలంటు.. రైతుల ఆందోళన
author img

By

Published : Oct 18, 2020, 9:56 AM IST

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డపేటలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మెదక్​ – ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట నీట మునిగిందంటూ రైతులు ఆందోళనకు దిగారు. నిజాంసాగర్​ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్​ చేశారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి.. వరద నీటిని విడుదల చేసిన అధికారులు తిరిగి గేట్లు మూయడం వల్ల వరి పొలాల్లోకి నీరు చేరిందంటూ రైతులు ధర్నాకు దిగారు. నిజాంసాగర్​ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలంటూ కోరారు. దాదాపు రెండు గంటల పాటు నిర్వహించిన ధర్నా వల్ల రోడ్డు మీద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

రైతుల ధర్నాకు కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి వడ్డేపల్లి సుభాష్​ రెడ్డి మద్దతు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి 9 గేట్లను ఎత్తారు. శాంతించిన రైతులు.. కష్టపడి పండించిన పంట నీట మునుగుతున్నా పట్టించుకోకపోతే సహించలేమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఎంపీపీ రాజ్​దాస్​, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వరదలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.