కామారెడ్డి జిల్లా అడ్లూరు వద్ద 44వ జాతీయ రహదారిపై టైర్ పేలి మంటలు చెలరేగి లారీ దగ్ధమైంది. పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు ట్రాక్టర్ విడి విభాగాల లోడ్‌తో లారీ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. లారీ టైరు పేలడం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించి లారీ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నిలపడం వల్ల ప్రాణపాయం తప్పింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం