విద్యుదాఘాతంతో పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో చోటుచేసుకుంది. నరసింహ జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల నిల్వ ఉంచిన పత్తితో పాటు పత్తి బేళ్లు, గోనె సంచులు, యంత్రాలు కాలిపోయినట్లు యజమాని తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను ఆర్పివేశారు. మొత్తం 91 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు మిల్లు యజమాని అగ్నిమాపక అధికారులు, పోలీసులకు తెలిపారు.
ఇవీ చూడండి: బైకును ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకరు మృతి