ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం.. బూడిదైన ధాన్యం - తెలంగాణ తాజా వార్తలు

కొనుగోలు కేంద్రంలో మంటలు చెలరేగి ధాన్యం కుప్పలు, బస్తాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​ మండలం ముగ్ధంపూర్​లో జరిగింది.

Telangana news
కామారెడ్డి వార్తలు
author img

By

Published : May 26, 2021, 10:59 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో ఉన్న వరిపొలంలో కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల సమీపాన ఉన్న కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు, బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం ముగ్ధంపూర్​లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల ధాన్యం బస్తాలు కాలిపోయాయి.

ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన బోయిని సాయిలు 45 బస్తాలు, గూల గంగారాం 15 బస్తాలు, బెంగరి రాములు, సాయిలుకు చెందిన 10 బస్తాలు, బెంగరి సంగవ్వ వరి ధాన్యం కుప్ప బూడిదయ్యింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే కొందరి రైతులు పంట బూడిదయ్యింది. ఘటనా స్థలిని స్థానిక ప్రజాప్రతినిధులు సందర్శించారు.

ఇదీ చూడండి: అడవి బిడ్డల ఆకలి తీరుస్తోన్న సీతక్క

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.