ETV Bharat / state

Grain collection: అక్కడ ధాన్యం అమ్ముకోవాలంటే పలుకుబడైనా ఉండాలి.. అడిగినంతైనా ఇవ్వాలి..! - కామారెడ్డి ధాన్యం రైతుల కష్టాలు

కామారెడ్డి జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు కొనుగోళ్లలో జాప్యం.. మరోవైపు వరుణుడి ప్రభావంతో అన్నదాత అతలాకుతలం అవుతున్నాడు. వీటికి తోడు పైరవీలు, తెలిసిన వాళ్లు, పలుకుబడి కలిగిన వారి ధాన్యం మాత్రం అందరికంటే ముందే మిల్లుకు వెళ్తోందన్న (Grain collection problems in kamareddy) ఆరోపణలు వినిపిస్తున్నాయి. అకాల వర్షాల వల్ల మొత్తం పంట నష్టపోయే కంటే.. డబ్బులు తీసుకున్నా, తరుగు ఎక్కువ ఇచ్చినా సరే కొనుగోళ్లు పూర్తయితే అదే చాలన్నట్లు రైతులు ఆలోచిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అన్నట్లుగా మారిన తంతుపై పరిశీలన కథనం.

farmers
farmers
author img

By

Published : Nov 18, 2021, 11:06 PM IST

Updated : Nov 19, 2021, 11:00 PM IST

Grain collection: అక్కడ ధాన్యం అమ్ముకోవాలంటే పలుకుబడైనా ఉండాలి.. అడిగినంతైనా ఇవ్వాలి..!

ఇటీవల కురిసిన వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని (kamareddy district) అన్ని కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తమ వంతు కోసం ఎదురు చూస్తున్న, తేమశాతం వచ్చి కుప్పగా పోసిన, కాంటా పూర్తయి బస్తాల్లో నింపిన ధాన్యం నీళ్లలో నానిపోయింది. గాంధారికి చెందిన ఓ రైతు తన ధాన్యం కేంద్రానికి తెచ్చాడు. కాంటా వేసి పదిరోజులు పూర్తైనా లారీలు లేక మిల్లుకు వెళ్లలేదు. ఈలోగా కురిసిన వర్షానికి తడిసి ముద్దైంది. తన వంతు 11 నంబర్ ఉన్నా కాదని.. 70 నంబర్ ఉన్న వారి ధాన్యం మిల్లుకు చేర్చారు. తనది మాత్రం తరలించకపోవడంతో పూర్తిగా తడిసిపోయింది. ఎవరు రూ.500 ఇస్తే వారి పంట తరలిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

ఏదీ లేకపోతే వేచి చూడాల్సిందే..

కామారెడ్డి జిల్లాలో డబ్బులు ఇస్తే ధాన్యం కొనుగోళ్లు అన్నట్లు (Grain collection problems in kamareddy) పరిస్థితి తయారైంది. ఎవరు డబ్బులు ఇస్తే వారి ధాన్యం ముందుగా కొంటున్నారు. లేదంటే వంతు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. పలుకుబడి అయినా ఉండాలి. అదీ కాకుంటే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పైరవీ అయినా ఉండాలి. ఏదీలేకుంటే ఆగాల్సిందే.. అన్నట్లుగా తయారైంది ధాన్యం రైతుల దుస్థితి. జిల్లాలోని సదాశివనగర్ మండలంలో ధాన్యం సంచికి రూపాయి లేదా రెండు రూపాయలు లారీ డ్రైవర్​కు ఇస్తే కాంటా వేసిన ధాన్యం తొందరగా మిల్లుకు తరలుతోంది.

లక్ష్మీ ప్రసన్నం చేస్తేనే ముందుకు కదిలేది..

గాంధారిలో సొసైటీ డైరెక్టర్లకు డబ్బులు ఎవరిస్తే వారిది ముందు కాంటా పూర్తవుతోంది. పలుకుబడి ఉన్న రైతులకు తొందరగానే పనైపోతోంది. లేదంటే రికమెండేషన్ చేసినా ధాన్యం ముందుగా కొంటున్నారు. మిగతా రైతులకు మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. కామారెడ్డి ఏరియాలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే, తెలిసిన వాళ్లుంటే తేమశాతం రాకున్నా కాంటా వేస్తున్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి, సరంపల్లి తదితర ఏరియాల్లో 12 శాతం తేమ వస్తేనే కాంటా వేస్తున్నారు. 17 శాతం నిబంధన ఉన్నా ఇక్కడ మాత్రం 12లోపు రావాల్సిందేనని పట్టుబడుతున్నారు.

ఒక్కో చోట ఒక్కో తీరు..

ఇక తరుగు, కేంద్రాల్లో సౌకర్యాల కొరత షరా మమూలే అన్నట్లుగా ఉంది. జిల్లాలో ఒక్కో చోట ఒక్కో రకంగా తరుగు తీస్తూ రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి కేంద్రంలో తరుగు 1200 గ్రాములు తీస్తే.. కామారెడ్డి ఏరియాలో 1,500 గ్రాములు తీస్తున్నారు. అలాగే ధాన్యం కొనేందుకు సదాశివనగర్ ఏరియాలో హమాలీ క్వింటాకు రూ.34 తీసుకుంటే.. కామారెడ్డి ఏరియాలో మాత్రం సంచికే రూ.40లు తీసుకుంటున్న దుస్థితి నెలకొంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు సాగుతున్నాయి.

ఇదో అదనపు భారం

ఇక సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లిలో కొనుగోలు కేంద్రానికి లారీ వెళ్లే దారి లేక కాంటా పూర్తయిన ధాన్యం బస్తాల్లో నింపి ట్రాక్టర్​లో లోడ్ చేస్తున్నారు. అరకిలోమీటర్ దూరం వరకు తరలించి లారీలో నింపాలి. దీనికి హమాలీ, ట్రాక్టర్ కిరాయి రైతులపై అదనంగా పడుతోంది. అప్పటికే ధాన్యం బస్తాల్లో నింపి కాంటా వేసినందుకు రైతులు హమాలీ చెల్లిస్తున్నా అదనపు భారం తప్పని దుస్థితి తలెత్తుతోందని రైతులు వాపోతున్నారు.

విసిగిపోతున్న అన్నదాతలు

కొనుగోలు కేంద్రాల తీరుతో, అధికారుల పర్యవేక్షణ లేమితో రైతులు విసిగిపోయారు. అకాల వర్షాలకు తడిసి పాడైపోయే బదులు తరుగు, డబ్బులు తీసుకున్నా సరే కాంటా పూర్తి చేసి మిల్లుకు తరలితే చాలన్నట్లు రైతులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: Congress Dharna: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి'

Last Updated : Nov 19, 2021, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.