ETV Bharat / state

Farmer Stuck in Flood Water : ఆకస్మాత్తుగా వరద.. గేదెల కోసం వెళ్లి వాగులో చిక్కుకున్న రైతు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 3:45 PM IST

Updated : Sep 4, 2023, 6:58 PM IST

Farmer Stuck in Vaagu in kamareddy District : కామారెడ్డి జిల్లాలో ఆదివారం నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గేదేల కోసం వెళ్లిన ఓ రైతు వాగులో చిక్కుకున్నాడు. వాగు ఉద్ధృతి పెరగడంతో రేకుల షెడ్డులో తలదాచుకున్నాడు. భారీ వర్షానికి పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తనను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశాడు. విషయం తెలియడంతో ఎమ్మెల్యే సురేందర్.. అధికారులను రప్పించి బోటు సాయంతో అతన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Farmer Stuck in Vaagu in kamareddy District
Farmer Stuck in Vaagu
Farmer Stuck in Flood Water ఆకస్మాత్తుగా వరద గేదెల కోసం వెళ్లి వాగులో చిక్కుకున్న రైతు

Farmer Stuck in Vaagu in kamareddy District : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతుసంఘం గ్రామం వద్ద భారీ వర్షాల(Kamareddy Rains) కారణంగా ఓ రైతు వరదల్లో చిక్కుకున్నాడు. ఎమ్మెల్యే సురేందర్.. అధికారులను రప్పించి బోటు సాయంతో అతన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సంగయ్య అనే రైతు గేదెల కోసం పొలానికి వెళ్లాడు. ఒక్కసారిగా వాగు ఉధృతి పెరిగి పొలం వద్ద ఉన్న రేకుల షెడ్డులో తలదాచుకున్నాడు. తనను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సురేందర్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. అనంతరం సిబ్బందితో కలిసి బోటులో వెళ్లిన ఎమ్మెల్యే.. రైతు సంగయ్యను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Hyderabad Rains Today : భాగ్యనగరంలో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

Heavy Rains in Kamareddy : కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగుల ఉధృతికి భారీగా వరద నీరు చేరడంతో పంట పొలాలు నీటి మునిగాయి. తాత్కాలిక రహదారుల(Temporary Roads) వద్ద రోడ్డు కోతకు గురై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. గాంధారి మండల కేంద్రంలో పాతికేళ్లుగా ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షం కురిసింది.

గాంధారి వాగు ఉధృతి కారణంగా పంట పొలాలు నీటి మునిగాయి. అలాగే సమీపంలోని కాలనీలోకి వరదనీరు వచ్చి చేరింది. కేవలం రెండు గంటల్లోనే 9 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది. బీర్కూర్, పోతంగల్ ప్రధాన రహదారిపై వర్షపు నీరు చేరడంతో ఆ పరిసరాలు అన్ని చెరువును తలపించాయి. జుక్కల్, బస్వాపూర్ మధ్యలో వంతెన పనుల కారణంగా ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ రోడ్డు కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

జిల్లాలో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. గాంధారి మండలంలో 14.4 సెంటీ మీటర్లు, సదాశివనగర్ మండలంలో 12 సెంటీమీటర్లు, జుక్కల్ మండలంలో 11.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కవుల స్నాల ప్రాజెక్టుకు 4931 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. మూడు గేట్లను ఎత్తి 7680 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 2500 చూసేకుల ప్రవాహం ఉండగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టటానికి చేరువలో ఉంది.

Water Levels in Telangana Projects Today : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు.. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు

Nizamabad Rains Today : మరోవైపు నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున మూడు గంటల నుంచి కురుస్తున్న కొండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోపాల్ మండలంలో 15.7 సెం.మీ.లు, ఇందల్వాయి 14.8 సెం.మీ.లు, డిచ్​పల్లి 14.2 సెం.మీ.లు, జక్రాన్ పల్లి 13.8 సెం.మీ.లు, సిరికొండ 13.5 సెం.మీ.లు, మాక్లుర్, నిజామాబాద్ నార్త్ మండలాల్లో 12 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాల కారణంగా నేడు జిల్లా పరిధిలో ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరుతుండగా.. 4 గేట్లు ఎత్తి 12 వేల పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ ప్రాంతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు సూచించారు.

Heavy Rains in Telangana Today : ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన.. తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లో భారీ వర్షం.. మరో రెండు రోజులు ఇలానే

Last Updated : Sep 4, 2023, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.