ETV Bharat / state

ఆవేదన జ్వాలై రగిలి.. పంటకు నిప్పు పెట్టిన రైతు - నియంత్రిత పంట సాగు విధానం

పంటని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్నదాత చేతికొచ్చిన పంటకు నిప్పు పెట్టాడు. ప్రభుత్వం సూచించిన నియంత్రిత సాగు పద్ధతిని పాటించి.. ప్రతిసారి వేసే దొడ్డు రకం వరి కాకుండా సన్నరకం వేసిన రైతు ఆశించిన దిగుబడి రాలేదని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి... పెట్టుబడి కాదు కదా కనీసం మరో పంటకు విత్తనాలు తయారు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందంటూ పంటకు నిప్పు పెట్టాడు.

ఆవేదన జ్వాలై రగిలి.. పంటకు నిప్పు పెట్టిన రైతు

author img

By

Published : Oct 23, 2020, 4:39 PM IST

దిగుబడి సరిగా రాలేదనే ఓ రైతు ఆవేదన జ్వాలై రగిలి... చెమటలు చిందించి పండించిన పంటను తగలబెట్టేలా చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలోని లింగాపూర్​ పరిధిలో చోటు చేసుకుంది. కొమిరెడ్డి నారాయణ అనే రైతు తనకున్న మూడెకరాల పొలంలో దొడ్డు రకం వరి పండించేవారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వ అధికారుల సూచనలతో ఈ సారి సన్నరకం వరి సాగు చేశారు.

"సన్నరకం వరి వేసినప్పటి నుంచి పంటను చీడపీడలు ఆశించాయి. అయినా వెనుకడుగేయకుండా మందులు చల్లుతూ పంటను కాపాడుకున్నాం. ఆ తర్వాత అకాల వర్షం... ఇప్పుడు దోమ దండయాత్ర చేసింది. రసాయనాలు పిచికారీ చేశాం. అయినా లాభం లేదు."

-రైతు

ఎకరానికి ఒక క్వింటా ధాన్యం వచ్చే పరిస్థితి లేదని... విసుగు చెంది సన్నరకం వరి పంటకు నిప్పు పెట్టారు ఆ రైతు. మూడెకరాల్లో ఆరుగాలం కష్టించి పండించిన పంటను బూడిద పాలు చేశారు. దొడ్డురకం వరి వేస్తే ఎకరాకు 40 క్వింటాలు దిగుబడి వచ్చేదని... అప్పులు తీర్చేవాడినని వాపోయారు.

జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.