ETV Bharat / state

"ఈటీవీ భారత్"​ చొరవతో స్వగ్రామానికి వలస కూలీలు

author img

By

Published : May 4, 2020, 11:30 AM IST

సొంతూరికి తీసుకెళ్తానని డబ్బులు తీసుకున్న వాహనం డ్రైవర్​ మార్గమధ్యలోనే దింపేశాడు. చేసేది లేక నడక సాగిస్తున్న వారికి ఈటీవీ భారత్ బాసటగా నిలిచింది.

etv bharat initiative officers set up a vehicle for migrant labours
ఈటీవీ భారత్​ చొరవ.. కూలీలకు వాహనం ఏర్పాటు

మహారాష్ట్రకు చెందిన సుమారు 20 మంది కూలీలు మిరపకాయలు కోసేందుకు ఖమ్మం జిల్లాకు వచ్చారు. లాక్​డౌన్​ వల్ల ఇక్కడే ఇరుక్కుపోయారు. వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో.. ఖమ్మం జిల్లా నుంచి ఓ వాహనంలో కూలీలందరు సొంత గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలోనే డ్రైవర్​ వారిని వదిలేసి వెళ్లాడు. చేసేదేమీలేక కూలీలు కాలిబాట పట్టారు.

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సరిహద్దులో గల చెక్​పోస్ట్​ వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఈటీవీ భారత్ ప్రతినిధి కూలీలను పలకరించారు. వారి ఇబ్బందులను తెలుసుకొని తనిఖీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు వారి వివరాలు తెలుసుకొని.. వాహనం ఏర్పాటు చేసి కూలీలను సొంత గ్రామానికి పంపించారు.

ఇదీ చూడండి: కందులమ్మితే నష్టం.. పప్పు కొనాలంటే కష్టం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.