ETV Bharat / state

తాగునీటి కోసం రోడ్డెక్కిన భిక్కనూరు మహిళలు

author img

By

Published : Feb 9, 2021, 10:16 AM IST

వేసవి రాకముందే కామారెడ్డి జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మంచి నీళ్ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని భిక్కనూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తాగునీటి కోసం జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు.

drinking water scarcity at bikkanur
తాగునీటి కోసం రోడ్డెక్కిన భిక్కనూరు మహిళలు

ఇంటింటికి మంచి నీరందించేందుకు తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ఇంకా కొన్ని గ్రామాల్లో అమలు కావడం లేదు. వేసవి సమీపిస్తుండటం వల్ల నీటి ఎద్దడున్న ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడక తప్పేలా లేదు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలకేంద్రంలో వేసవి రాకముందే తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. మంచి నీరు కావాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి తీసుకురావాల్సిన దుస్థితి ఎదురైంది. తాగునీరు సరఫరా చేయాలని అధికారులకు పలుమార్లు మొర పెట్టుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదని భిక్కనూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

మంచినీరు కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఇప్పటికైనా అధికారులు, పంచాయతీ పాలకవర్గం స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.