కామారెడ్డి జిల్లా మద్నూర్ డోంగ్లీ గ్రామానికి చెందిన జాదవ్ అనిత-శివ దంపతులు వైద్యులు, పోలీసులకు కొత్త తరహాలో కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని మద్నూర్ మండలం సలబత్ పూర్ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, పోలీసుల కాళ్లు కడిగారు. కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. కరోనా నివారణకు నిరంతరం కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులే మాకు దేవుళ్లని అనిత-శివ దంపతులన్నారు. అనంతరం అక్కడి అధికారులకు, సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ లేఖ