కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును జిల్లా పాలనాధికారి శరత్ మంగళవారం సందర్శించారు. నీటి నిల్వలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాన్ని సందర్శించారు.

అదేవిధంగా ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ప్రకృతి వనాల్లో మొక్కలను దగ్గర దగ్గరగా పెట్టి చిట్టడివి లాగా తయారు చేయాలని సూచించారు. జిల్లాలో రెండు లక్షల ఇళ్లను సర్వే చేసి కొవిడ్ 19, సీజనల్ వ్యాధిగ్రస్తులను గుర్తించామని చెప్పారు. ఆరోగ్య కేంద్రాలలో నాలుగు వందల వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఆయనతో పాటు జిల్లా ఉప వైద్యాధికారి శోభారాణి, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీడీవోలు తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!