కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లమ్ గ్రామంలో పోచారం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు, అంగన్వాడీ కార్యకర్తలకు, నిరుపేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పంపిణీ చేశారు. కరోనా వైరస్ నియంత్రణ కొరకు ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని తెలిపారు.
కరోనా నియంత్రణ కోసం దూరం పాటించడమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. పేదలకు 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదును అందజేసిన ఏకైక సర్కారు తెలంగాణ ప్రభుత్వమేనని భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ దామోదర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎన్ 95 మాస్క్‌కు మించి రక్షణ కల్పించే మాస్క్