ETV Bharat / state

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన పంటలు - crops drenched in rain water in kamareddy district

రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలు నిండిపోయాయి. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

crops drenched in kamareddy district due to heavy rain
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం
author img

By

Published : Sep 18, 2020, 2:32 PM IST

కామారెడ్డి జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగి రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. మహారాష్ట్రలో కురిసిన వర్షానికి మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామంలోని లెండి వాగుకు భారీగా వరద నీరు చేరడం వల్ల ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

జుక్కల్ మండలం కౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరి.. ప్రాజెక్టు నిండుకుండలా మారడం వల్ల అధికారులు రెండు గేట్లు ఎత్తివేశారు. జుక్కల్ మండలానికి వెళ్లే మూడు రహదారులు వరదకు కొట్టుకుపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బిచ్కుంద మండలం పుల్కల్, పెద్ద డేవాడ గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగింది. సోనాల, తడి హిప్పర్గ, లింబూర్, మాధన్ హిప్పర్గ, ఇలేగావ్, ఎన్​ బూర, దోతి గ్రామాల్లోని వందల ఎకరాల్లో సోయా, పత్తి, వరి, మినుము పంటలు నీట మునిగాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.