ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో ఆరుగాలం కష్టించి పండించిన పంటలు వర్షార్పణం అయ్యాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంతో పాటు తాండూరు గ్రామంలో వరి పొలాలు నీటమునిగాయి. సింగూరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం వల్ల మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ భారీ వరద నీరు నిజాంసాగర్ జలాశయానికి చేరుతోంది. ఫలితంగా మంజీరా నది పరీవాహక ప్రాంతాలైన నాగిరెడ్డిపేట, తాండూర్ గ్రామాల్లో వరి జలమయం అయింది.
బంజారా తండా సమీపంలో ఎల్లారెడ్డి, మెదక్ ప్రధాన రహదారికి వరకు వరద నీరు చేరింది. నీళ్లపాలైన పంటలకు పరిహారం చెల్లించి... ప్రభుత్వమే తమని ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: నీట మునిగిన 8.7 లక్షల ఎకరాలు.. పంటనష్టం రూ.1,500 కోట్లు