కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలికి చెట్టు కూలగా.. ఓ ఆవు మృతి చెందింది. గ్రామంలోని పలువురి ఇంటి పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కదులుతున్న బస్సు కిందపడి కొవిడ్ బాధితుడు బలవన్మరణం