ETV Bharat / state

కరోనా విజృంభణ... 11 రోజుల్లో 1577 మందికి

author img

By

Published : Aug 26, 2020, 10:56 AM IST

కామారెడ్డి జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మంగళవారం 273 పాజిటివ్​ కేసులు నమోదు కాగా... 11 రోజుల్లో 1577 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.

corona cases increasing in kamareddy
corona cases increasing in kamareddy

కామారెడ్డి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో మంగళవారం 273 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో 169 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధరణైంది.

కొవిడ్‌ ప్రబలుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. వైరస్‌ కట్టడికి స్వీయ నియంత్రణ అవసరమన్నారు. జిల్లాలో పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కొవిడ్‌ నోడల్‌ జిల్లా అధికారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ఈ నెలలోనే అధికం

జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ విజృంభణ ఆగడం లేదు. ఈ పదకొండు రోజుల్లోనే 1577 మందికి వైరస్‌ సోకింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఈ 11 రోజుల్లోనే 43.27 శాతం మందికి కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఆగస్టులోనే 2794 మంది వైరస్‌ బారిన పడ్డారు. కామారెడ్డి, బాన్సువాడ డివిజన్లలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా వచ్చిన ఆర్‌టీపీసీఆర్‌ ఫలితాల్లో 104 మందికి వైరస్‌ సోకింది.

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి మృతి

జిల్లా కేంద్రానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు(59) కరోనాతో హైదరాబాద్‌లో మంగళవారం మృతిచెందారు. పక్షం రోజుల క్రితం వైరస్‌ సోకగా రాజధానిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందారు. అంతక్రియలను అక్కడే చేశారు. ఆయన టీటీఎఫ్‌ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.

బాన్సువాడలో 66 మందికి..

బాన్సువాడ డివిజన్‌లో సోమవారం సేకరించిన 128 నమూనాల్లో 52 మందికి కరోనా సోకినట్లు తేలిందని బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రి పర్యవేక్షకుడు శ్రీనివాస్‌ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం 54 మంది కరోనా అనుమానితులకు ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షలు చేయగా 14 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైనట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.