ETV Bharat / state

రైతుల పట్ల ప్రభుత్వాల తీరుపై షబ్బీర్​ ఆగ్రహం - kamareddy news

కామారెడ్డి జిల్లాలో ధర్నా చౌక్ వద్ద రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా.. దిల్లీ రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొని.. దిల్లీలో చనిపోయిన రైతులకు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు చేశారు.

congress protest at kamareddy dharna chowk and former minister shabbir ali fires on pm, cm
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మాజీ మంత్రి ఆగ్రహం
author img

By

Published : Jan 12, 2021, 1:02 PM IST

రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధంగా ప్రవర్తిస్తున్నాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు చట్టాల విషయంలో యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్​ వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా.. దిల్లీ రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. దిల్లీలో చనిపోయిన రైతులకు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఏం చేసిందో తెలియదా?:

"రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధంగా ప్రవర్తిస్తున్నాయి. రైతులకు నష్టం కలిగించే విధంగా కేంద్రం చట్టాలను తీసుకువస్తే వ్యతిరేకించాల్సిన సీఎం కేసీఆర్ జై కొడుతున్నారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేసి రైతులను రోడ్డున పడేస్తున్నారు.

దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని భాజపా తరచూ అడుగుతోంది. ఏం చేశామో మీకు తెలియదా? దేశంలో 30 శాతం మందికి కూడా ఆహారం దొరకని పరిస్థితుల్లో.. 100 శాతం మందికి ఆహారం దొరికేలా చేశాం. నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్​దే. గరీబి హఠావో పేరుతో ప్రజలకు సంపదలను సృష్టిస్తే.. వాటిని ప్రైవేటీకరణ దిశగా మోదీ తీసుకెళ్తున్నారు. దేశంలో వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం మోదీ కుట్రలు చేస్తున్నారు."

-షబ్బీర్ అలీ, మాజీ మంత్రి

దిల్లీలో గడ్డకట్టే చలిలో వంద మంది రైతులు చనిపోతే.. ప్రధాని మోదీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. గత నెల 8న రైతు చట్టాలను రద్దు చేయాలని రహదారుల దిగ్బంధానికి పిలుపునిస్తే కేటీఆర్​, హరీష్​ సహా మంత్రులంతా పాల్గొన్నారని గుర్తు చేశారు. కేసులకు భయపడి యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు.

కాళేశ్వరం నీటిని కామారెడ్డి జిల్లాకూ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. త్వరలో 22 ప్యాకేజి పనుల కోసం పాదయాత్ర చేపడతానని తెలిపారు. ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాశ్​ శ్రీనివాస్ రావు, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజక వర్గాల ఇంఛార్జీలు కాసుల బాలరాజు, వడ్డేపల్లి సుభాశ్​ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గవర్నర్​కు వినతిపత్రం అందించిన భాజపా నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.