మొక్కజొన్న పంటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ కామారెడ్డి జిల్లా గాంధారిలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. నాయకులు, రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు నియంత్రిత సాగు పేరుతో ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఏంటని టీపీసీసీ రాష్ట్ర సభ్యుడు వడ్డేపల్లి సుభాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తన భూమిలో ఏ పంట పండుతుందో ఆ పంటలే వేయొదంటూ ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరమన్నారు. ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాల్లో వరి పంటలు మాత్రమే పండుతాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నియంత్రిత సాగు ఆలోచన విరమించుకోవాలని సుభాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.