ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలో పాలనాధికారి డాక్టర్ శరత్ పర్యటించారు. గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పరిశీలించారు.
భూంపల్లిలోని అంబరీషుని గుట్టపై ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. మొక్కలకు పాదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ప్రజల సహకారంతో స్వచ్ఛ గ్రామాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు కవిత, లలితా బాయి, డీపీవో నరేశ్ కుమార్, ఎంపీడీవో అశోక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎనుమాముల మార్కెట్లో మొదలైన పత్తి కొనుగోళ్లు