ETV Bharat / state

పోర్టబిలిటీ పేరుతో పేదల బియ్యంకు టోకరా - Cheating for Ration Rice

కుమ్మక్కైన రేషన్‌డీలర్లు.... సహకరించిన కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది..... లబ్ధిదారుల పేరుతో బియ్యం స్వాహా.. కరోనా కాలంలో రేషన్ పొర్టబులిటీ పేరుతో డీలర్ల నయా దందా. ఇదీ కామారెడ్డి జిల్లాలో జరిగిన రేషన్‌బియ్యం అక్రమాల తీరు. ఏకంగా జిల్లాలు దాటేసి మహబూబాబాద్ లబ్ధిదారుల బియ్యం కామారెడ్డి రేషన్ డీలర్లు స్వాహా చేసిన తీరు అధికారులను విస్మయానికి గురిచేసింది.

Cheating for poor Peoples rice in the name of portability
పోర్టబిలిటీ పేరుతో పేదల బియ్యంకు టోకరా
author img

By

Published : Aug 31, 2020, 3:45 AM IST

పోర్టబిలిటీ పేరుతో పేదల బియ్యంకు టోకరా

రేషన్ బియ్యం అక్రమాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. ఇప్పటి వరకు రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులు తీసుకోకుండా మిగిలిన బియ్యాన్ని ప్రభుత్వానికి లెక్కచెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునేవారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కొందరు రేషన్ డీలర్లు మరో అడుగు ముందుకేసి కొత్త దందాకు తెరలేపారు. ఇతర జిల్లాలకు చెందిన రేషన్ డీలర్లతో కుమ్మక్కై అక్కడి లబ్ధిదారుల బియ్యంవారికి తెలియకుండా రెవెన్యూసిబ్బంది సహకారంతో సొమ్ము చేసుకున్నారు. లబ్ధిదారుల ఫిర్యాదుతో విచారణ చేసిన అధికారులు నిజాలను నిగ్గుతేల్చారు.

పేదల బియ్యం.. అక్రమార్కుల పరం

ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు అరికట్టేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. లబ్ధిదారులు ఎక్కడున్నా ఆప్రాంతంలోనే రేషన్ తీసుకునే వెసులుబాటు పోర్టబులిటీ తీసుకొచ్చింది. బయోమెట్రిక్ యంత్రాల్లో వేలిముద్రలు వేస్తే కరోనా వచ్చే అవకాశం ఉందని థర్డ్‌పార్టీ వేలి ముద్రలతో పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీఆర్వో, వీఆర్​ఏలు వేలి ముద్రలు వేసి లబ్ధిదారులకు బియ్యం అందేలా ఆదేశాలిచ్చారు. ఈ అవకాశాన్ని కొందరు అక్రమాలకు కేంద్రంగా మార్చారు. మహబూబాబాద్‌ డీలర్లు తమ పరిధిలో రేషన్ తీసుకోని వారి జాబితాను కామారెడ్డి డీలర్లకు పంపారు. జాబితా ప్రకారం రేషన్ పోర్టబులిటీ కింద బియ్యం తీసుకుని నల్లబజారులో విక్రయించి సొమ్ము చేసుకున్నారు.

173 క్వింటాళ్ల బియ్యం పందికొక్కుల పాలు

కామారెడ్డి జిల్లా బీర్కూర్, ఎల్లారెడ్డి మండలాలకు 173 మంది లబ్ధిదారులకు చెందాల్సిన 173 క్వింటాళ్ల బియ్యాన్ని బొక్కేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల విచారణలో తేలింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, బయ్యారం, కేసముద్రం, పెద్దవంగరకు చెందిన వారి పేర్లతో పోర్టబిలిటీ అవకాశాన్ని దుర్వినియోగం చేశారు.

అంతటా ఇదే దందా

ఎల్లారెడ్డి 9 నంబర్ రేషన్ దుకాణంతో పాటు బాన్సువాడ, తాడ్వాయి మండలాల్లోనూ ఇలాంటి తరహా మోసాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా పోర్టబులిటీ ఎక్కడ ఎక్కువగా జరిగిందో ఆయాదుకాణాలను గుర్తించి విచారణ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అక్రమాలకు పాల్పడిన డీలర్లు, వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ఇదీ చూడండి: కేసీఆర్​ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.