కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో కరోనా అవగాహనపై పోలీసుల కళాబృందం పలు కార్యక్రమాలు నిర్వహించారు. కొవిడ్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు, సూచనలు చేశారు. కరోనా దరి చేరకుండా ఉండాలంటే మాస్క్ తప్పక ధరించాలి. తరుచుగా రెండు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
మనిషికి.. మనిషికి మధ్య 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని.. ప్రతి ఒక్కరు కరోనా నియమాలను పాటించి కరోనా నియంత్రణకు తోడ్పడాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్ శర్మ మరియు పోలీస్ కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.