ప్రతి విద్యార్థి పాఠశాలకు వందశాతం హాజరయ్యేలా చూసే బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్ల బహుకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 2018- 19 విద్యా సంవత్సరంలో నూరుశాతం హాజరైన 14 మంది విద్యార్థులకు స్పీకర్ సైకిళ్లను పంపిణీ చేశారు. సైకిళ్లను అందజేసిన దాతలను అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విద్యా ప్రమాణాలను పెంచడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సత్ఫలితాలు సాధిస్తోందన్నారు. గురువులను గౌరవించాలని వారి బోధనలను శ్రద్ధతో వినాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ రాజేశ్వర్, ఎంపీపీ నీరజ వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ పద్మగోపాల్ రెడ్డి, రైసస జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. రాజు, ఎంఈఓ నాగేశ్వర్, ప్రధానోపాధ్యాయులు చంద్రప్ప, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో యువతి హత్య కేసు.. నిందితులు ఐదుగురు