ETV Bharat / state

Bandi Sanjay Letter to Kcr: 'కేసీఆర్ ప్రభుత్వం ఒక తరాన్ని నాశనం చేసింది'

కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక తరం విద్యావంతుల బతుకులు నాశనం చేసిందని బండి సంజయ్ విమర్శించారు. ఉద్యోగ నియామకాలపై బండి సంజయ్ సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు.

Bandi Sanjay
బండి సంజయ్
author img

By

Published : Sep 15, 2021, 4:13 PM IST

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bjp State president Bandi Sanjay) ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహిరంగ లేఖ (Bandi Letter to Cm Kcr) రాశారు. ఇందులో బండి సంజయ్​ ఘాటుగా స్పందించారు. తన ప్రజా సంగ్రామ యాత్రలో ప్రతి చోట నిరుద్యోగులు తమ బాధలు చెప్పి ఆవేదన చెందుతున్నారన్నారు. స్వరాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతను ప్రభుత్వం మోసం చేసిందని లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక తరం విద్యావంతుల యువకుల బతుకులు నాశనం చేసిందని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు త్వరలో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగులను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో, అసెంబ్లీలో నిరుద్యోగ భృతి ఇస్తామని ఊదరగొట్టి రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. అతీగతీ లేదని ఎద్దేవా చేశారు. వెంటనే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సంజయ్ లేఖలో డిమాండ్ చేశారు. నియామకాలు, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే.. తమ పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కామారెడ్డి జిల్లాకు చేరిన యాత్ర...

ప్రజాసంగ్రామ యాత్ర 19రోజు మెదక్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోకి నాగిరెడ్డి పేట్ మండలం పోచారం వద్ద పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీగా స్వాగతం పలికారు. పూల దండలు, మంగళ హారతులు ఇచ్చి మహిళలు తిలకం దిద్దారు. ఈరోజు జిల్లాలో 14.3 కి.మీ. జిల్లాలో పాదయాత్ర ఉండగా రాత్రికి బంజారా తండాలో బస చేయనున్నారు. జిల్లాలో మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర కొనసాగనుండగా మొత్తం 86 కి.మీ.లు పాదయాత్ర సాగనుంది. ఈనెల 17న నిర్మల్ సభ నేపథ్యంలో పాదయాత్రకు విరామం ఉండనుంది.

ఇదీ చూడండి: BANDI SANJAY: 'సంక్షేమ పథకాలపై ఈటీవీ భారత్ వేదికగా తెరాసతో చర్చకు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.