ETV Bharat / state

'పేదలపై విద్యుత్​ బిల్లుల రూపంలో పెనుభారం సరికాదు' - భాజపా ధర్నా

లాక్​డౌన్​ సమయంలో విద్యుత్​  బిల్లులు వసూలు చేయడంలో అవకతవకలు జరిగాయని, మూడు నెలల బిల్లు ఒకేసారి వేసి.. ప్రజలపై భారం వేశారని కామారెడ్డి భాజపా నేతలు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్​ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

BJP Protest On Electricity Bills In Kamareddy Town
విద్యుత్​ బిల్లులు రద్దు చేయాలని భాజపా ధర్నా
author img

By

Published : Jun 15, 2020, 8:48 PM IST

కామారెడ్డిలోని విద్యుత్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లాక్​డౌన్​ సమయంలో విద్యుత్ బిల్లుల్లో అవకతవకలు జరిగాయని భాజపా నేతలు డిమాండ్​ చేశారు. కరోనా సమయంలో విధించిన విద్యుత్ బిల్లులో అనేక అవకతవకలు జరిగాయని, ప్రజలు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే.. మూడు నెలల విద్యుత్​ బిల్లు ఒకేసారి ప్రజలపై మోపడం సరికాదని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట రమణారెడ్డి మండిపడ్డారు.

మూడు నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : కరీంనగర్​ కమిషనరేట్​లో లైసెన్సు రద్దు సెంచరీ దాటేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.