దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద 26 రోజులుగా రైతు ఉద్యమ సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టినట్లు జేఎసీ కన్వీనర్ జగన్నాథం తెలిపారు.
నిరసన దీక్షలను మంగళవారంతో ముగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామన్నారు.
ఇదీ చదవండి: మానేరు డ్యాంపై మరో 300 మెగావాట్ల సోలార్ ప్లాంటు : శ్రీధర్