కోఫ్టా చట్టం నుంచి బీడీ పరిశ్రమను కేంద్రం మినహాయించాలని రాష్ట్ర బీడీ కార్మిక సంఘ్ కార్యదర్శి శివయ్య డిమాండ్ చేశారు. పొగాకు ఉత్పత్తులన్నింటినీ రద్దు చేయాలని ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని ఆరోపించారు.
మిషనరీలతో కాదు..
బీఎమ్ఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద సుమారు 3 వేల మంది కార్మికులతో ధర్నా చేపట్టారు. బీడీ అనేది చేతి ద్వారా తయారయ్యేదని అన్నారు. మిషనరీలతో తయారు చేసేది కాదని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలను కోఫ్టా చట్టంలో కొనసాగిస్తే నాలుగున్నర కోట్ల మంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సంస్థలు తీసుకురావాలని చూస్తుందన్నారు. బీడీ పరిశ్రమనూ స్వదేశీ సంస్థగా గుర్తించాలని కోరారు. ఫ్యాక్టరీలు రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: బడాపహాడ్లో భక్తుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు