ETV Bharat / state

తీసుకున్న అప్పు కట్టలేదని.. ఇంటి తలుపులు తీసేశారు..! - Ankole village latest news

తీసుకున్న రుణాలు చెల్లించలేదని ఓ బ్యాంకు అధికారులు ఓ రైతు ఇంటి తలుపులను తొలగించారు. మరో అన్నదాత ద్విచక్రవాహనాన్ని.. ఇంకో రైతు ఇంట్లో ల్యాప్‌టాప్, సామగ్రిని జప్తు చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.

Kamareddy district
Kamareddy district
author img

By

Published : Mar 19, 2023, 9:12 AM IST

కార్పొరేట్ వ్యక్తులు ఎంతోమంది బ్యాంకుల్లో రుణాలు తీసుకొని.. చెల్లించకుండా ఎగవేతకు పాల్పడుతున్నారు. కానీ అలాంటి వారిపై బ్యాంకు సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు మనం నిత్యం ఏదో చోట వింటూనే ఉంటాం. అదే రైతుల విషయానికి వచ్చేసరికి బ్యాంకుల తీరు మరోలా ఉంటోంది. వ్యవసాయంలో పెట్టుబడి కోసం రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే వారు కొన్నిసార్లు వాయిదాలు సక్రమంగా చెల్లించరు. వారికి బ్యాంకు అధికారులు డబ్బులు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తారు. అప్పటికీ వినకపోతే వేలం వేస్తామని హెచ్చరిస్తారు. డబ్బులు సమకూరక రైతన్న అప్పు కట్టకపోతే ఇంట్లో ఉన్న సామగ్రి వేలం వేసి మరీ బ్యాంకు సిబ్బంది తమ బకాయి వసూలు చేసుకుంటుంటారు. అలాంటి సమయాల్లో మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

రుణాలు చెల్లించలేదని దుర్కి సహకార కేంద్ర బ్యాంకు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ రైతు ఇంటి తలుపులను తీసేశారు. మరో రైతు ద్విచక్ర వాహనాన్ని, ఇంకో అన్నదాత ఇంట్లో ల్యాప్‌టాప్‌, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నస్రుల్లాబాద్‌ మండలం అంకోల్​కు చెందిన చెంచు హన్మాండ్లు 2010లో తన భూమి పట్టాదారు పాస్ ​పుస్తకాన్ని.. దుర్కి సహకార కేంద్ర బ్యాంకులో తనఖా పెట్టి రూ.5 లక్షల రుణం తీసుకున్నారు. రూ.60,000 చొప్పున నాలుగు వాయిదాలు చెల్లించాడు. ఇంకా ఆరు వాయిదాలు చెల్లించాల్సి ఉంది. అయితే వారం క్రితం బ్యాంకు అధికారులు అతనికి.. మిగతా డబ్బులు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే శనివారం సహకార కేంద్ర బ్యాంకు అధికారులు, సొసైటీ కార్యదర్శులు, సిబ్బంది అంకోల్​కు వెళ్లారు.

వాయిదాలు ఎందుకు చెల్లించడం లేదని బ్యాంకు అధికారులు రైతులను నిలదీశారు. ఇందులో భాగంగానే సిబ్బంది.. హాన్మాండ్లు ఇంటి తలుపులు తొలగించి వాహనంలో పెట్టుకున్నారు. పసుపుల లక్ష్మణ్ కుమారుడి ల్యాప్​టాప్‌ను.. పసుపుల సాంబయ్య కుమారుడి ద్విచక్ర వాహనాన్ని తీసుకొని వాహనాల్లో వేశారు. ఈ నేపథ్యంలోనే గంట తర్వాత ఓ రైతు రూ.50,000, మరో రైతు రూ.20,000 చెల్లించారు. దీంతో అధికారులు ల్యాప్‌టాప్, ద్విచక్ర వాహనాన్ని తిరిగి ఇచ్చారు. హన్మాండ్లు వారిని వేడుకోగా ఇంటి తలుపులు ఇచ్చారు. మంగళవారం డబ్బులు కట్టకపోతే తలుపులు, సామగ్రిని తీసుకెళ్తామని బ్యాంకు అధికారులు హెచ్చరించి వెళ్లారు. మరోవైపు వారు ప్రవర్తించిన తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి: TSPSC పరీక్షల రీషెడ్యూల్.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న కమిషన్‌

ధరణి సమస్యల పరిష్కారంపై సర్కార్ కసరత్తు.. మాడ్యూళ్లపైనే ప్రత్యేక దృష్టి

రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు.. పలు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు

కుటుంబాన్ని మింగేసిన క్యాన్సర్ మహమ్మారి.. చనిపోయే ముందు రూ.2 కోట్ల ఆస్తిని దానం చేసిన మహిళ

'దేశంలో ప్రజాస్వామ్యం పటిష్ఠం.. ఓర్వలేకే వారి దాడులు! అయినా ఆగేదే లే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.