ETV Bharat / state

రైతుల సంతోషంతోనే రాష్ట్రం సుభిక్షం: సభాపతి పోచారం - కామారెడ్డి జిల్లా సమాచారం

రైతులు సంతోషంగా ఉండాలంటే జలాలు సమృద్ధిగా ఉండాలని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్​ మండలంలోని మంజీరా నదిపై చెక్​ డ్యాము​ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

assembly-speaker-pocharam-srinivas-reddy-started-construction-of-check-dams-works-in-kamareddy-district-in-birkur-m
రైతుల సంతోషంతోనే రాష్ట్రం సుభిక్షం: సభాపతి పోచారం
author img

By

Published : Jan 28, 2021, 5:01 PM IST

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జలసంపద పెరగాలని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్​ మండల పరిధిలోని మంజీరా నదిపై రూ.28.29 కోట్లతో నిర్మిస్తున్న చెక్ ​డ్యామ్ పనులను ఆయన ప్రారంభించారు.

అదేవిధంగా బాన్సువాడ వద్ద రూ.18 కోట్లతో చెక్ డ్యాము​లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిజాంసాగర్ నుంచి మంజీరా నదిపై చెక్ డ్యాము​లు ఏర్పాటు చేసి భూగర్భజలాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, బాన్సువాడ తెరాస ఇన్​ఛార్జ్​ పోచారం సురేందర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ప్రీమియర్ లాజిస్టిక్ హబ్​గా హైదరాబాద్​: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.