కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఓ ముక్కుపచ్చలారని పసికందుకు తల్లి లేకుండా చేసింది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా...లారీ వెనుకభాగం తగిలింది. వెనక కూర్చున్న భార్య లారీ టైర్లకింద పడి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. పెద్దకొడప్గల్ మండలంలోని విఠల్ తండాకు చెందిన దంపతులు.. తమ మూన్నెళ్ల బాబుతో రాఖీ పండుగకు తాడ్వాయికి వెళ్తున్నారు.
భర్త, శిశువు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బోరున విలపిస్తున్న చిన్నారిని అక్కడకు వచ్చిన పోలీసులు ఎత్తుకుని లాలించాడు. ఆ విషాదకర ఘటన స్థానికులను కలచివేసింది.
ఇదీ చూడండి : ప్లాస్మాను దానం చేయాలని కోరిన హీరో నాని