కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఓ బ్యాంకు ఉన్నతాధికారికి కరోనా సోకింది. నాలుగు రోజులుగా బ్యాంక్ సేవలను నిలిపివేసి శానిటైజ్ చేశారు. తిరిగి సోమవారం నుంచి బ్యాంకును పునఃప్రారంభించారు.
అయితే అధికారులు గేటు బయట నుంచే ఖాతాదారుల లావాదేవీలకు సంబంధించిన సేవలను అందిస్తున్నారు. దీనితో ఎండలోనే నిలుచుని ఉండాల్సి వస్తోందని.. అధికారులు చొరవ చేసుకుని ఆరుబయట కనీసం టెంటైనా ఏర్పాటు చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు