ETV Bharat / state

రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి - రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

కామారెడ్డి జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు బావిలో పడి మృతి చెందగా... మరొకరు చెరువులో పడి చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

three people died in kamareddy
రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
author img

By

Published : May 10, 2020, 4:24 PM IST

కామారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ఘటనలలో ముగ్గురు మృతి చెందారు. దేవునిపల్లి గ్రామానికి చెందిన షేక్ మీరా, ఆయన కొడుకు ఆరేళ్ల మౌలానా నిన్న మధ్యాహ్నం లింగాపూర్ గ్రామంలోని ఒక బావి వద్దకు చేపల వేటకు వెళ్లారు. రాత్రి అయినా వారు ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబీకులు అంతటా గాలించారు. ఆచూకీ లభ్యం కాలేదు. ఈ రోజు ఉదయం బావిలో తండ్రీ కొడుకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందిచారు. షేక్ మీరాకు ఫిట్స్ వస్తుందని.. ఫిట్స్ వల్లే బావిలో పడిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బాబు కూడా తండ్రిని పట్టుకొని ఆయనతో పాటు నీళ్లలో మునిగిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మద్యం తాగి.. చెరువులో తేలాడు

9 సంవత్సరాల క్రితం నారాయణ్​ఖేడ్ గ్రామానికి చెందిన మల్లేష్ దేవునిపల్లికి చెందిన రాజేశ్వరిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. మల్లేష్ తాగుడుకు బానిసయ్యాడు. ప్రతి రోజూ భార్యా పిల్లలను కొడుతూ ఉండేవాడు. భార్య గొడవకు దిగితే నారాయణ్​ఖేడ్​కి వెళ్లిపోయాడు. మూడు రోజుల క్రితం బాగా తాగొచ్చి భార్యను కొట్టి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఎప్పటిలాగే ఇంటికి వెళ్లిపోయాడేమో అనుకున్న రాజేశ్వరి వెతకడం మానేసింది. మల్లేష్ ఈ రోజు చెరువులో శవంగా తేలాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రాజేశ్వరి కన్నీరుమున్నీరైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: మాజీ మంత్రి రత్నాకర్​రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.