జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణ కేంద్రంలో అఖిలపక్ష నాయకులు, ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం మంజూరు చేసిన వంద పడకల ఆస్పత్రి నిర్మాణం అలంపూర్ పట్టణంలో జరగాలని డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలో నిర్మించకూడదంటూ పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ధర్నా చేస్తున్న ప్రాంతానికి ఎమ్మెల్యే అబ్రహం రాగా... ప్రజలు ఆయనను అడ్డుకుని నిరసన తెలిపారు. ఆస్పత్రిని పట్టణంలో నిర్మిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఆందోళన విరమించేది లేదన్నారు.
ఇదీ చదవండిః గ్రామదేవత ఘనంగా బోనాలు సమర్పణ