ETV Bharat / state

మల్దకల్​లో ఘనంగా వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

మల్దకల్‌లో ఘనంగా వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

venkateswara-swamy-brahmotsavalu-is-celebrated-in-maldakal-in-gadwal-district
మల్దకల్​లో ఘనంగా వెంకేటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Dec 31, 2020, 12:13 PM IST

జోగులాంబ గద్వాల్​ జిల్లా మల్దకల్‌లో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 28న కల్యాణోత్సవం, 29న తెప్పోత్సవం, 30న రథోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాలకు తరలివచ్చారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రాచూర్యంలో ఉన్న కథ

గద్వాల్​ను పరిపాలించిన సోమనాద్రి రాజు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు గుర్రం ముందుకు కదలకపోవడంతో ఇక్కడేదో మహిమ ఉన్నదని రాజు గుర్తించాడు. ఓ బాలుని సాయంతో అడవిలో వెతకగా ఒక శిలపై శ్రీనివాసుడు స్వయంభూగా వెలిసినట్లు గుర్తించి... గుడి నిర్మిస్తానని మొక్కుకోగా గుర్రం ముందుకు కదిలిందని అక్కడి ప్రజలు చెపుతారు. రాజు అక్కడ పెద్ద దేవాలయం నిర్మించారని... ప్రతియేటా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇక్కడి ప్రజలు తిరుపతికి వెళ్లరని... గుడికి రెండోవ అంతస్తు నిర్మించరని తెలిపారు. ఈ ఆచారం నేటికీ కొనసాగుతున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: శ్రీవారి సేవకురాలితో తితిదే ఉద్యోగి అసభ్య ప్రవర్తన..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.