జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఈనెల 20 నుంచి జరగబోయే తుంగభద్ర నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం... పుష్కర ఘాట్లను పరిశీలించారు. అక్కడి పరిసరాలను కలియతిరిగారు.
పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో ప్రేమకుమార్‌కు సూచించారు. వేణు సోంపురం పుష్కరఘాట్ల దగ్గర నీరు లేదని.. నీటిని విడుదల చేసే విధంగా కర్ణాటక అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
రెండో దశ కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తుంగభద్ర నది పుష్కరాలు ఘనంగా నిర్వహించాలని ఉన్నప్పటికీ... కరోనా తీవ్రత దృష్ట్యా నిరాడంబరంగా జరపించాలని కేసీఆర్ సూచించినట్లు పేర్కొన్నారు.
పుష్కరాల ప్రారంభానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. ఉమ్మడి జిల్లా మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్.. కుటుంబ సభ్యులతో రానున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: 'అందమైన నగరంగా నిజామాబాద్‌ని తీర్చిదిద్దుతున్నాం'