జోగులాంబగద్వాల అలాంపూర్లో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య నదీమ తల్లికి మూడో రోజు హారతులిచ్చారు. కర్పూర పంచహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, రథ హారతుల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని, అమ్మ వార్లను దర్శించుకున్నారు.
అలంపూర్, రాజోలి, పుల్లూర్, వేణిసొంపురం పుష్కర ఘాట్ల వద్ద మూడో రోజు సుమారు 24వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. పుష్కరాల ముగిసే వరకు రోజూ 6.30 గంటలకు నదీ హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. హారతి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ అపురూప ఘట్టాన్ని తిలకించారు.
ఇదీ చదవండి: వైభవంగా తుంగభద్ర పుష్కరాలు... రెండో రోజు పోటెత్తిన భక్తులు