జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సరిహద్దులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల్లోని వారు సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడం వల్ల తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అలంపూర్‌లోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిఘా పెంచారు. ప్రత్యేక చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు.
తమిళనాడు, కర్ణాటక ఆంధ్రప్రదేశ్‌ల నుంచి రాష్ట్రంలోనికి వచ్చే వారిని చెక్‌పోస్టు వద్ద ఆపి వారి వివరాలు సేకరిస్తున్నారు. వారికి థర్మల్ స్కానర్‌తో వైద్య సిబ్బంది నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. అనంతరం చేతిపై ముద్రవేసి హోమ్ క్వారంటైన్ లో ఉండాలని బయట తిరగవద్దని సూచిస్తున్నారు. అనుమతులు లేకుండా వచ్చేవారిని తిరిగి వెనక్కు పంపిస్తున్నారు.
ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్ భేష్'