జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి శివారులోని వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. రైతులందరూ దళారులను నమ్మి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల ద్వారానే పత్తిని అమ్ముకోవాలని సూచించారు.
ప్రభుత్వం మద్దతు ధర 5,550 రూపాయలు నిర్ణయించిందని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తేమ శాతం తక్కువగా ఉండి నాణ్యమైన పత్తిని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పుష్పమ్మ తెలిపారు.
ఇదీ చూడండి : తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి: రాజా సింగ్