ETV Bharat / state

ఏం చేసినా కేసీఆర్​కే సాధ్యం: మంత్రి నిరంజన్​ - CONGRESS

ఏం చేసినా కేసీఆర్ కే సాధ్యమని... కాంగ్రెస్​తో లాభమేమి ఉండదని అలంపూర్​లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. ఈరోజు నాగర్​ కర్నూల్​ తెరాస ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములుతో కలిసి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రచారంలో మంత్రి నిరంజన్​ రెడ్డి
author img

By

Published : Apr 3, 2019, 10:30 PM IST

ప్రచారంలో మంత్రి నిరంజన్​ రెడ్డి
ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి, నాగర్​ కర్నూల్​ తెరాస ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ముందుగా మంత్రికి స్థానిక ఎమ్మెల్యే అబ్రహం పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత అలంపూర్​ సభలో పాల్గొన్నారు. అభివృద్ధి జరిగితే అది కేసీఆర్​తోనే అని మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు.

దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పదవి కొద్ది రోజుల్లో ముగుస్తుండం వల్ల అర్చకులు గుడికి అసిస్టెంట్​ కమిషనర్​ హోదా ఉన్న అధికారిని నియమించాలని మంత్రిని కోరారు. ఎలక్షన్​ కోడ్​ ఉన్నందున తర్వాత నియమిస్తామని మంత్రి తెలిపారు.

ఇవీ చూడండి:'దేశ గతిని మార్చే అజెండా రూపొందిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.