జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేళ్లలోనే పూర్తి చేశారని గువ్వల బాలరాజు అన్నారు. కేసీఆర్ సారథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కష్టపడి పనిచేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం నేడు దేశం గర్వించే స్థాయికి చేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్మృతి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్ సరిత పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు