ETV Bharat / state

వీధికుక్కల్లో వింత ప్రవర్తన.. వైద్యులు ఏమంటున్నారంటే? - jogulamba gadwal

ఈ కరోనా కాలంలో మనుషుల్లోనే కాదు జంతువుల్లో ఏ చిన్న మార్పు కనిపించినా జనం జంకుతున్నారు. ఆ మహమ్మారే సోకి ఉంటుందని భయపడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వీధికుక్కలకు గొంతు వద్ద వాపు వచ్చి దగ్గుతుండటం వల్ల కరోనా అని అనుమానించిన గ్రామస్థులు వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు.

Strange behavior in street dogs in jogulamba gadwal
వీధికుక్కల్లో వింత ప్రవర్తన.. కరోనా కాదన్న వైద్యులు
author img

By

Published : Apr 30, 2020, 6:32 AM IST

వీధి శునకాలకు కరోనా సోకిందని స్థానికుల నుంచి ఫిర్యాదు రావడం వల్ల పరీక్షలు నిర్వహించిన వెటర్నరీ అధికారులు ఆ వైరస్‌ సోకలేదని తేల్చారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో శునకాలకు గొంతు వద్ద వాపు వచ్చి దగ్గుతుండటం వల్ల వాటికి కరోనా సోకిందని ప్రచారం సాగింది. జిల్లా వెటర్నరీ అధికారులకు కొందరు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

శునకాలకు వెటర్నరీ సిబ్బంది పరీక్షలు చేయగా.. వాటికి కరోనా సోకలేదని నిర్ధారణ అయిందని జోగులాంబ గద్వాల జిల్లా వెటర్నరీ అధికారి ఆదిత్య కేశవసాయి తెలిపారు. గ్రామ సమీపంలోని ఓ పౌల్ట్రీ ఫాం వద్ద కోళ్ల వ్యర్థాలను తినడం వల్ల శునకాలు ఇలా ప్రవరిస్తున్నాయని తేల్చారు. మంగళ, బుధవారాల్లో వెటర్నరీ అధికారులు వాటికి యాంటీ బయాటిక్స్‌, మాత్రలను వేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:సెప్టెంబర్​ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.