జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్పీ రంజన్ రతన్ కుమార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. శానిటైజర్లు వాడుతూ, భౌతిక దూరం పాటించాలని కోరారు.
పట్టణంలోని దుకాణాల్లో తిరుగుతూ మాస్కులు పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించిన వారికి జరిమానా విధించారు. కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'శ్మశానంలో ఖాళీ లేదు.. 20 గంటల తర్వాత రండి'