జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని క్యాతుర్, లింగన్ వాయి గ్రామాల్లో లాక్డౌన్(Lock down) అమలు తీరును ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ పరిశీలించారు.
గ్రామాల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని సూచించారు. ఇంట్లోనే ఉండాలని, అలాంటి వారు బయట తిరిగినా, వ్యవసాయ పనులకు వెళ్లినా కరోనా వ్యాప్తికి కారణం అవుతారని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో అందరూ బాధ్యత ఉండాలని జిల్లా ఎస్పీ గ్రామస్థులకు తెలిపారు.
లాక్డౌన్(Lock down) పర్యవేక్షణలో భాగంగా ఆదివారం.. ఎస్పీ, డీఎస్పీ యాదగిరితో కలిసి ఆ గ్రామాలను సందర్శించి.. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎవరైనా బయటకు వస్తే మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. మధ్యాహ్నం నుంచి ప్రజలు అందరూ లాక్డౌన్(Lock down)ను పాటిస్తూ బయటకు రావొద్దని కోరారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా వివాహాలు, ఫంక్షన్లు నిర్వహిస్తే వారిపై చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: Ask KTR: వ్యాక్సిన్ల కొరతపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Lock down: గ్రామాల్లో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన ఎస్పీ
గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని క్యాతుర్, లింగన్ వాయి గ్రామాల్లో లాక్డౌన్(Lock down) అమలు తీరును ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ పరిశీలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని కోరారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.